తెలుగు సామెతలు, గ్రామ్యం – గిరీశం గారి నుంచి (తెలంగాణాలో వాడబడేవి) – part 2
ఉరికురికి పశువులు కాస్తే పొద్దుగుంకదు
చదువు చారెడు బలపాలు దోసెడు
సర్వకైనా ముంత కైనా చాంతాడే
తెగిన బొక్కన బావిలో వరకే
కుండదగ్గర చూస్తే, బండ దగ్గర చూస్తది
అందని ద్రాక్షపండులు పుల్లన
తాదూర కంత లేదు, మెడకో డోలు
రంకునేర్చినమ్మ బొంకనేర్చింది
ఆడలేక మద్దెలోడు
ఆయన చెప్పిన ఒక పద్యం:-
ధనమెక్కిన మదమెక్కును , మదమెక్కిన మచ్చరంబు మరి మరి ఎక్కున్
దనముడిగిన మదముడుగును, మదముడిగిన మచ్చరంబు మరి మరి ఉడుగున్
సిరి తా వచ్చిన వచ్చును , సరళితముగ నారికేళ సలిలం బంగిన్
సిరి తా పోయిన పోవును , కరిమింగిన వెలగపండు గదరా సుమతి